: ఓటు బ్యాంకు రాజకీయాలపై సుప్రీం సంచలన తీర్పు


కుల, మతాల పేరుతో విభజన రాజకీయాలు చేయవద్దంటూ రాజకీయ నేతలకు సుప్రీంకోర్టు వార్నింగ్ ఇచ్చింది. ఏ రాజకీయ పార్టీ కానీ, ఏ రాజకీయ నేత కానీ కులం పేరుతో, మతం పేరుతో ఓట్లను అడగరాదంటూ హెచ్చరించింది. కులాలను, మతాలను దుర్వినియోగం చేయడం కూడా అవినీతి కిందకే వస్తుందని తెలిపింది. హిందుత్వ కేసులో దాఖలైన వివిధ పిటిషన్లను ఏడుగురు న్యాయమూర్తులతో కూడిన విస్తృత రాజ్యాంగ ధర్మాసనం నేడు విచారించింది.

కులం, మతం అనేవి మన లౌకిక విధానంలో ఒక భాగమని... వీటికి అతీతంగానే ఎన్నికలు జరగాలని ఈ సందర్భంగా రాజ్యాంగ ధర్మాసనం తెలిపింది. మతం అనేది భగవంతుడికి, మనిషికి మధ్య ఉన్న వ్యక్తిగత సంబంధమని.. ఇందులో ఎవరూ జోక్యం చేసుకోరాదని తేల్చి చెప్పింది. ఇందులో ప్రభుత్వాల ప్రమేయం ఎంతమాత్రం ఉండరాదని తెలిపింది. రెండు దశాబ్దాల క్రితం ఇచ్చిన 'హిందుత్వ' తీర్పును నేడు సుప్రీంకోర్టు పున:సమీక్షించి, సవివరంగా తీర్పును వెలువరించింది.



  • Loading...

More Telugu News