: పంజగుట్టలో రెచ్చిపోయిన మందుబాబులు.. తప్పతాగి డివైడర్‌ను ఢీకొట్టి పరార్
హైదరాబాద్‌లో ఆదివారం రాత్రి మందుబాబులు రెచ్చిపోయారు. ఫుల్లుగా తాగి కారు నడుపుతూ డివైడర్‌ను ఢీకొట్టారు. విషయం తెలిసి పోలీసులు వచ్చేసరికి అక్కడి నుంచి పరారయ్యారు. పంజగుట్టలోని నాగార్జున సర్కిల్, జీవీకే మాల్ మధ్య ఈ ఘటన చోటుచేసుకుంది. డివైడర్‌ను వేగంగా ఢీకొట్టిన కారు బోల్తా పడింది. ప్రమాదం విషయం తెలుసుకున్న పోలీసులు వచ్చేసరికి మందుబాబులు అక్కడి నుంచి పరారయ్యారు. కారులో పెద్ద ఎత్తున మద్యం బాటిళ్లు, అమ్మాయిల చెప్పులు, రక్తపు మరకలను పోలీసులు గుర్తించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. కారులో ఉన్న రక్తపు మరకలను బట్టి కారులోని వారు గాయపడినట్టు తెలుస్తోందని పోలీసులు పేర్కొన్నారు. సీసీ కెమెరా, కారు నంబరు ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.