: శ్రీ కృష్ణుడి వేషం వేసిన లాలు ప్రసాద్ యాదవ్ కుమారుడు!
ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు, బీహార్ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్ ఈ రోజు చేతిలో ఫ్లూట్ పట్టుకొని కృష్ణుడి వేషం వేశారు. శ్రీకృష్ణుడి భక్తుడు ఒకరు తనకు కానుకగా శ్రీకృష్ణుడి దుస్తులతో పాటు ఫ్లూట్ ఇచ్చారని, వాటిని ధరించే ఈ నూతన సంవత్సర వేడుకలను చేసుకున్నానని తేజ్ ప్రతాప్ యాదవ్ తెలిపారు. కాసేపు ఫ్లూట్ వాయించి సందడి చేశారు.