: ‘ఇస్తాంబుల్ నైట్‌క్లబ్‌లో దాడి’ ఘటనలో ఇద్దరు భారతీయుల మృతి: సుష్మాస్వరాజ్
టర్కీలోని ఇస్తాంబుల్ నగరంలోని ఓ నైట్‌క్లబ్‌లో న్యూ ఇయర్ వేడుకలు జరుగుతుండగా శాంతాక్లజ్ వేషంలో వచ్చిన ఓ ఉగ్రవాది విచక్షణారహితంగా కాల్పులు జరిపిన విషయం తెలిలిసిందే. ఈ ఘటనలో మృతుల సంఖ్య 39కి పెరిగింది. మృతుల్లో ఇద్దరు భారతీయులు కూడా ఉన్నట్లు కొద్ది సేపటి క్రితం భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపారు. ఈ కాల్పుల్లో మధ్యప్రదేశ్‌కు చెందిన అబీస్ రిజ్వీ అనే యువకుడు, గుజరాత్‌కు చెందిన ఖుషీ అనే యువతి ప్రాణాలు కోల్పోయినట్లు ఆమె పేర్కొన్నారు. ఈ సమాచారం అందుకున్న వెంటనే టర్కీలోని భారత రాయబారి ఇస్తాంబుల్‌కు బయలుదేరారని ఆమె చెప్పారు. ఈ ఘటనను ఉగ్రచర్యగా భావిస్తోన్న టర్కీ ప్రభుత్వం దర్యాప్తు ప్రారంభించింది.
I have a bad news from Turkey. We have lost two Indian nationals in the Istanbul attack. Indian Ambassador is on way to Istanbul. /1
— Sushma Swaraj (@SushmaSwaraj) January 1, 2017