: సమాజ్‌వాదీ పార్టీ నుంచి అమర్‌ సింగ్ సస్పెన్షన్.. రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి శివపాల్ యాదవ్ కు ఉద్వాసన!


త‌న బాబాయ్ శివపాల్ యాదవ్ పై ఆగ్ర‌హంగా ఉన్న ఉత్త‌రప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి అఖిలేష్ యాద‌వ్ తాను అన్నంత ప‌ని చేశారు. ఈ రోజు ములాయం సింగ్ యాద‌వ్ కి పోటీగా ల‌క్నోలో అఖిలేష్ యాద‌వ్ నిర్వ‌హించిన‌ పార్టీ జాతీయస్థాయి సమావేశంలో పార్టీ నుంచి అమర్‌సింగ్‌ను సస్పెండ్ చేశారు. ఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడి పదవి నుంచి శివపాల్‌ యాదవ్‌ను తప్పిస్తున్నట్లు నిర్ణ‌యం తీసుకుని ఆ మేర‌కు ప్ర‌క‌ట‌న చేశారు. ఈ పదవిలో మరో బాబాయ్ రాంగోపాల్ యాదవ్ ను నియమించారు. ఈ సందర్భంగా అఖిలేష్ యాద‌వ్ మాట్లాడుతూ, త‌మ‌ పార్టీకి వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్న వారివల్ల నష్టం జరుగుతోందని, తాను త‌న తండ్రికి వ్య‌తిరేకం కాద‌ని స్ప‌ష్టం చేసిన సంగ‌తి తెలిసిందే. ములాయం ఆదేశాలను ప‌ట్టించుకోకుండా పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, నేతలు ఈ సమావేశానికి హాజరుకావడం ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

  • Loading...

More Telugu News