: అబూ బకర్ చనిపోలేదు.. వేట కొనసాగుతోంది: అమెరికా సంచలన ప్రకటన


అందరూ భావిస్తున్నట్టుగా ఐఎస్ఐఎస్ ఉగ్రవాద అధినేత అబూ బకర్ అల్ - బగ్దాదీ మరణించలేదని, ఆయనింకా బతికే ఉన్నట్టు నమ్ముతున్నామని అమెరికా సంచలన ప్రకటన చేసింది. అయితే, సైనికులు చుట్టుముట్టిన మోసుల్ నగరంలోనే ఆయన ఉన్నాడా? లేక మరెక్కడికైనా పారిపోయాడా? అన్న విషయమై తమ వద్ద సమాచారం లేదని పెంటగాన్ ప్రతినిధి పీటర్ కుక్ వెల్లడించారు. బాగ్దాదీ ఇంకా ఐఎస్ఐఎస్ ను నడుపుతున్నట్టు సమాచారం ఉందని, ఆయన ఎక్కడున్నాడన్నది పసిగట్టేందుకు చేయాల్సిన కృషి చేస్తున్నామని, అతని కోసం వేట కొనసాగుతోందని చెప్పారు.

కాగా, 2014లో ఖలీఫా రాజ్యాన్ని ప్రకటించిన అబూ బకర్, ఎన్నో ప్రపంచ దేశాలపై ఉగ్ర దాడులు చేయిస్తూ, ప్రజలకు నిద్ర లేకుండా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల బగ్దాదీ తలపై ఉన్న బహుమానాన్ని అమెరికా రెండింతలు పెంచింది. గత సంవత్సరం జూన్ లో సైన్యం దాడుల్లో అబూ బకర్ మరణించినట్లు వార్తలు రాగా, అమెరికా తాజా ప్రకటనతో ఆయనింకా జీవించే ఉన్నట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News