: కిటకిటలాడుతున్న దేవాలయాలు... గుడి ప్రాంగణాలను దాటి రహదారులపైకి భక్తుల క్యూలైన్లు!


దేశవ్యాప్తంగా దేవాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. నూతన సంవత్సరం శుభవేళ దైవ దర్శనం కోసం భక్తులు ఆలయాల బాట పట్టారు. తిరుమలతో పాటు యాదాద్రి, విజయవాడ కనకదుర్గమ్మ దేవాలయాలతో పాటు శ్రీశైలం, వేములవాడ, సింహాచలం, అరసవెల్లి, బాసర దేవాలయాలకు భక్తుల తాకిడి అధికంగా ఉంది. తిరుమల శ్రీవారి దర్శనానికి ఆరు గంటల సమయం పడుతుండగా, యాదగిరి నరసింహుని వద్ద నాలుగు గంటలకు పైగా క్యూలో భక్తులు నిలబడాల్సిన పరిస్థితి వుంది. భక్తుల తాకిడి అధికంగా ఉండటంతో, యాదగిరిగుట్టపైకి వాహనాల ప్రవేశాన్ని నిలిపివేశారు.

హైదరాబాద్ లోని బిర్లా మందిర్, దిల్ సుఖ్ నగర్ సాయిబాబా గుడి, జూబ్లీ హిల్స్ పెద్దమ్మ టెంపుల్ వద్ద భక్తుల సౌకర్యార్థం మరిన్ని ఏర్పాట్లు చేయాల్సి వచ్చింది. దేశవ్యాప్తంగానూ ఇదే పరిస్థితి నెలకొంది. ముంబై సిద్ధి వినాయక ఆలయం వద్ద భక్తుల క్యూలైన్ దేవాలయం దాటి రోడ్డుపైకి వచ్చేసింది. కాశీలోని విశ్వేశ్వరాలయం, మధుర మీనాక్షి తదితర దేవాలయాల్లో వేలాది మంది దర్శనం కోసం వేచి చూస్తున్న పరిస్థితి నెలకొంది.

  • Loading...

More Telugu News