: తండ్రి అలిగాడు అంతే... అంతకుమించి ఏమీ లేదు!: ములాయం, అఖిలేష్ వివాదంపై ఆజం ఖాన్


మరో రెండు మూడు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు ఎదుర్కోవాల్సిన తరుణంలో ఎవరికి వారు అభ్యర్థుల జాబితాను విడుదల చేసి పెను వివాదానికి కారణమైన సీఎం అఖిలేష్ యాదవ్, ఆయన తండ్రి, సమాజ్ వాదీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్ ల మధ్య వివాదాన్ని చాలా చిన్న విషయంగా యూపీ మంత్రి ఆజం ఖాన్ కొట్టిపారేశారు. నిన్న బల ప్రదర్శన అనంతరం అత్యధిక ఎమ్మెల్యేలు అఖిలేష్ వెంట ఉండటంతో, ములాయం వర్గం దిగిరాక తప్పలేదు. ఆపై ఆజం ఖాన్ స్వయంగా అఖిలేష్ ను ములాయం ఇంటికి తీసుకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆజం ఖాన్ మాట్లాడుతూ, "తండ్రి అలిగాడు... ఆపై తన కొడుకుతో మాట్లాడాడు. అంతకుమించి ఏమీ లేదు" అని అన్నారు. అంతకుముందు బీహార్ నేత, ములాయం సింగ్ యాదవ్ కు ఇటీవలే వియ్యంకుడిగా మారిన లాలూ ప్రసాద్ యాదవ్ మధ్యవర్తిత్వం చేసి పరిస్థితిని చెయ్యిదాటకుండా చేయడంలో సఫలీకృతులయ్యారు.

  • Loading...

More Telugu News