: ఇల్లు కట్టించుకోండి...రుణాల వడ్డీలో రాయితీ ఇస్తాం : మోదీ


పెద్ద నోట్ల రద్దు అనంతరం దేశంలో ఏటా 10 లక్షల రూపాయలకు పైగా సంపాదన కలిగిన వారు దేశంలో సుమారు 24 లక్షల మంది ఉన్నారని తేలిందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. జాతినుద్దేశించి ఆయన మాట్లాడుతూ, చట్టం తనపని తాను చేసుకుపోతుందని అన్నారు. పట్టణాల్లో నివసించే నిరు పేద, దిగువ మధ్య తరగతి, మధ్య తరగతి ప్రజల కోసం రెండు పథకాలు అమలులోకి తీసుకొస్తున్నామని చెప్పిన ఆయన, వారు కట్టించుకునే ఇంటికి తీసుకునే 9 లక్షల రూపాయల వడ్డీలో 4 శాతం రాయితీ ఇస్తామని చెప్పారు. 12 లక్షల రుణానికి సంబంధించిన వడ్డీలో 3 శాతం రాయితీ ఇస్తామని చెప్పారు.

గ్రామాల్లో నిర్మించే ఇళ్ల రుణాల వడ్డీలో 3 శాతం రాయితీ ఇస్తామని ఆయన చెప్పారు. చిరు వ్యాపారులకు 50 శాతం క్రెడిట్ పెంచుతామని చెప్పారు. కిసాన్ క్రెడిట్ కార్డులను రూపే కార్డులుగా మారుస్తామని అయన అన్నారు. 7.5 లక్షల రూపాయలు పదేళ్ల పాటు డిపాజిట్ చేస్తే 8 శాతం వడ్డీ ఇస్తామని ఆయన చెప్పారు. దీంతో బ్యాంకులకు వెళ్లాల్సిన అవసరం తప్పుతుందని అన్నారు. డీసీసీబీ, ప్రైమరీ సొసైటీల నుంచి తీసుకున్న అప్పుపై 2 నెలల వడ్డీ మాఫీ చేస్తామని ఆయన చెప్పారు. ఎన్నికల్లో ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి నిర్వహించే అంశాన్ని పరిశీలిస్తున్నామని ఆయన తెలిపారు. 

  • Loading...

More Telugu News