: మోదీకి రాహుల్ గాంధీ ట్వీట్ల ద్వారా పలు డిమాండులు!


ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోదీకి ట్విట్టర్ ద్వారా పలు డిమాండ్లను చేశారు. ప్రధానిపై ప్రజకు నమ్మకం పూర్తిగా తొలగిపోయిందని, వారానికి 24,000 రూపాయలు మాత్రమే విత్ డ్రా చేసుకోవాలన్న నిబంధనను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. అన్ని డిజిటల్ లావాదేవీలపైన సర్ ఛార్జీలను ఎత్తివేయాలని ఆయన సూచించారు. రైతులకు కనీస మద్దతుధర 20 శాతం ఇవ్వాలని కోరారు. దారిద్ర్యరేఖకు దిగువన ఉన్నవారి ఖాతాల్లో 25,000 రూపాయలు జమ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. చిరు వ్యాపారులకు పన్నులో 50 శాతం రాయితీ ఇవ్వాలని ఆయన సూచించారు. మరికాసేపట్లో మోదీ జాతినిద్దేశించి ప్రసంగించనున్న సందర్భంగా రాహుల్ ఈ ట్వీట్ చేయడం విశేషం. 

  • Loading...

More Telugu News