: వంద రూపాయలతో ఆరోగ్య రక్ష పథకం.. చంద్రబాబు ప్రకటన!


కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ, ఎన్టీఆర్ వైద్య సేవలో భాగంగా ఆరోగ్య రక్ష పథకం తీసుకొచ్చామని అన్నారు. దారిద్ర్యరేఖకు ఎగువన ఉండేవారినుద్దేశించి ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన చెప్పారు. ఇందులో 100 రూపాయలు ప్రతినెలా చెల్లించడం ద్వారా 2 లక్షల రూపాయల విలువైన వైద్యసేవలను కుటుంబం ఉచితంగా పొందవచ్చని ఆయన అన్నారు. దీనికోసం ఫిబ్రవరి 28 లోపు పేర్లు నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు. ఆంధ్రప్రదేశ్ కు 2016వ సంవత్సరం ఎంతో కీలకమైనదని అన్నారు. సొంత రాష్ట్రం నుంచి పరిపాలనకు ముందడుగు వేయడం, తాత్కాలిక సచివాలయ నిర్మాణం, పట్టిసీమ, పోలవరం పనులు ఇలా అన్నీ శుభశకునాలేనని ఆయన చెప్పారు. 

  • Loading...

More Telugu News