: 2017.. రెండు రాష్ట్రాల ప్రజల ఆశలను నెరవేరుస్తుందని ఆకాంక్షిస్తున్నా : పవన్ కల్యాణ్


జనసేన పార్టీ అధినేత, ప్రముఖ నటుడు పవన్ కల్యాణ్ దేశ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. జనసేన పార్టీ లెటర్ హెడ్ పై నూతన సంవత్సర శుభాకాంక్షల సందేశాన్ని తెలిపిన పవన్, దానిని తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేశారు. ‘2016 ఎన్నో కష్టాలను ప్రజలకు చవి చూపించి వెళ్లిపోయింది. కరెన్సీ రద్దు రూపంలో సామాన్యులను కాటేసింది. ఏపీకి ప్రత్యేక హోదాను అందని మావి పండుగా మార్చింది. కానీ, 2017 రెండు రాష్ట్రాల ప్రజల ఆశలను సంపూర్తిగా నెరవేరుస్తుందని ఆకాంక్షిస్తున్నాను. మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ర్టాలు ప్రగతి పథంలో పయనించాలని మనసారా కోరుకుంటూ..జైహింద్’ అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News