: 'ఐఓఏ'ను సస్పెండ్ చేసి మంచి పని చేశారు: అభినవ్ బింద్రా


భారత ఒలింపిక్స్ సంఘం (ఐఓఏ)ను సస్పెండ్ చేస్తూ కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ తీసుకున్న నిర్ణయాన్ని షూటర్ అభినవ్ బింద్రా సమర్థించాడు. క్రీడల్లో పారదర్శకత ఉండాలంటే ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాడు. క్రీడా శాఖ తీసుకున్న నిర్ణయం శుభ సంకేతమని తెలిపాడు. క్రీడా మంత్రి గోయల్ తీసుకున్న నిర్ణయం కొన్ని విలువలను కాపాడటానికి దోహదం చేస్తుందని చెప్పాడు. 2010లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్ సందర్భంగా వేల కోట్ల అక్రమాలు జరిగాయనే ఆరోపణలను సురేష్ కల్మాడీ, అభయ్ సింగ్ చౌతాలాలను జీవిత కాల గౌరవ అధ్యక్షులుగా ఐఓఏ నియమించిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని క్రీడల శాఖ సూచించినా... ఐఓఏ పట్టించుకోలేదు. దీంతో, దానిపై నిషేధం విధించింది క్రీడల శాఖ. 

  • Loading...

More Telugu News