: గోవా బీచుల్లో అర్భాజ్ ఖాన్, మలైకా అరోరా


బాలీవుడ్ హాట్ కపుల్ అర్భాజ్ ఖాన్, మలైకా అరోరాలు తమ కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలసి గోవా బీచుల్లో ఎంజాయ్ చేస్తున్నారు. వాస్తవానికి మలైకా, అర్భాజ్ లు విడాకుల కోసం ఇప్పటికే కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ తర్వాత వారిద్దరూ కలసి బయట ఎక్కడా కనిపించలేదు. కానీ, గోవాలో మాత్రం ఇద్దరూ కలసి హ్యాపీ మూడ్ లోనే గడిపారు. మలైకా అరోరాతో పాటు ఆమె తల్లిదండ్రులు, సోదరి అమృతా అరోరా, ప్రముఖ నటుడు చుంకీ పాండే, ఆయన భార్య భావన పాండే, ఇతర స్నేహితులంతా కొద్ది రోజుల క్రితమే గోవా వెళ్లిపోయారు. ఆ తర్వాత వారికి అర్భాజ్ ఖాన్ జతకలిశాడు. గోవా సెలబ్రేషన్ ఫొటోలను మలైకా అరోరా తన ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. 

  • Loading...

More Telugu News