: ఏపీ భవన్ లో భద్రతా చర్యలు చేపట్టిన సిబ్బంది
ఏపీ భవన్ లో భద్రతా లోపాలు ఎక్కువగా ఉన్నాయంటూ ఢిల్లీ పోలీసుల హెచ్చరికల నేపథ్యంలో సంబంధిత సిబ్బంది అప్రమత్తమయ్యారు. అనుమతిలేని వాహనాలను లోపలికి వెళ్లనీయకపోవడమే కాకుండా, అనుమతి లేకుండా పార్కింగ్ లో నిలిపిన వాహనాలను బయటకు పంపించే పనిలో ఏపీ భవన్ సిబ్బంది నిమగ్నమయ్యారు. కాగా, ఏపీ భవన్ లో భద్రతా లోపాలు ఎక్కువగా ఉన్నాయని ఎన్నిసార్లు హెచ్చరించినా అధికారులు స్పందించలేదని ఢిల్లీ ఇంటెలిజెన్స్ ఈరోజు పేర్కొంది. ఈ విషయమై హెచ్చరించడం ఇదే చివరిసారని వారు స్పష్టం చేశారు.