: శశికళకు వ్యతిరేకంగా... జయ సమాధి వద్ద ఆత్మహత్యాయత్నం!


అన్నాడీఎంకే పార్టీ అధినేత్రిగా శశికళ బాధ్యతలు స్వీకరిస్తున్న వేళ... జయలలిత సమాధి వద్ద ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం సంచలనం రేకెత్తించింది. పార్టీ పగ్గాలను శశికళ చేపట్టడాన్ని వ్యతిరేకిస్తూ సుమతి అనే మహిళ విషం తాగి ఆత్మహత్యకు యత్నించింది. చుట్టుపక్కల ఉన్న వారు ఈ ఘటనను గమనించి, వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. జయ మరణంపై అనేక అనుమానాలు ఉన్నాయి. చివరకు మద్రాసు హైకోర్టు కూడా అనుమానాలు వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో జయ సమాధి వద్ద ఆత్మహత్యాయత్నం జరగడం కలకలం రేపుతోంది. 

  • Loading...

More Telugu News