: సీఎం చంద్రబాబు కదలికలపై మావోయిస్టుల కన్ను.. ఆరుసార్లు రెక్కీ నిర్వహించిన వైనం!
ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కదలికలపై మావోయిస్టులు కన్నేసినట్లు నిఘా వర్గాల సమాచారంలో బయటపడింది. చంద్రబాబు ఢిల్లీ పర్యటన సమయంలో మావోయిస్టులు రెక్కీ నిర్వహించారని, ఏపీ భవన్ పరిసరాల్లో పలుమార్లు మావోయిస్టులు తచ్చాడారని ఢిల్లీ పోలీసుల నిఘాలో బయటపడింది. ఇప్పటివరకు, మావోయిస్టులు ఆరుసార్లు రెక్కీ నిర్వహించారని, మీడియా ముసుగులో చంద్రబాబుపై దాడికి పాల్పడే అవకాశం ఉన్నట్లు ఢిల్లీ ఇంటెలిజెన్స్ గుర్తించింది. ఏపీ భవన్ లో భద్రతా లోపాలు ఎక్కువగా ఉన్నాయని, ఈ విషయమై సంబంధిత అధికారులను హెచ్చరించినా పట్టించుకోలేదని వారు అంటున్నారు. ఏపీ భవన్ అధికారులను ఈ విషయమై ఈరోజు చివరిసారిగా హెచ్చరిస్తున్నామని ఢిల్లీ పోలీసులు తెగేసి చెప్పారు.