: 2016లో బాలీవుడ్ లో చోటు చేసుకున్న టాప్ వివాదాలు ఇవే!


బాలీవుడ్ లో చోటు చేసుకునే ప్రతి చిన్న విషయం కూడా బాగా పాప్యులర్ అవుతుంది. బాలీవుడ్ వార్తల కోసం కోట్లాది మంది సినీ అభిమానులు ఎదురు చూస్తుంటారు. అది కామెంట్ అయినా, కాంట్రవర్సీ అయినా, డేటింగ్ అయినా, మరేదైనా సరే... సోషల్ మీడియాలో వైరల్ కావాల్సిందే. 2016లో కూడా బాలీవుడ్ లో అనేక సంచలనాలు నమోదయ్యాయి. వాటిలో కొన్ని ప్రముఖమైన వాటిని చూద్దాం.

1. సల్మాన్ రేప్ కామెంట్స్: తన సూపర్ హిట్ సినిమా 'సుల్తాన్' కోసం తాము పడిన కష్టాన్ని సల్మాన్ వివరిస్తూ... రెజ్లింగ్ సన్నివేశాల్లో పాల్గొన్న తర్వాత రేప్ కు గురైన మహిళలా తన పరిస్థితి ఉండేదని వ్యాఖ్యానించాడు. ఈ వ్యాఖ్యలపై దేశ వ్యాప్తంగా నిరసన వ్యక్తమయింది. మహిళా సంఘాలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశాయి.

2. పాకిస్థానీ నటులపై నిషేధం: జమ్ముకశ్మీర్ లో జరిగిన ఉరీ ఉగ్రదాడిలో 19 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత పాక్ ఆక్రమిత కశ్మీర్ లో భారత బలగాలు సర్జికల్ స్ట్రైక్స్ జరిపాయి. ఈ క్రమంలో, బాలీవుడ్ సినిమాల్లో పాకిస్థానీ నటులు ఉంటే వాటిని అడ్డుకుంటామని మహారాష్ట్ర నవ నిర్మాణ సేన అధినేత హెచ్చరించారు. అంతేకాదు, తమ సినిమా థియేటర్లలో పాక్ నటులున్న సినిమాలను ప్రదర్శించబోమని ముంబైలోని థియేటర్ల యజమానులు ప్రకటించారు. దీంతో, 'యే దిల్ హై ముష్కిల్' సినిమా దర్శక నిర్మాత కరణ్ జొహార్ కన్నీరు పెట్టుకున్నంత పనిచేశాడు. చివరకు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ సమక్షంలో రాజ్ థాకరేతో జరిగిన సమావేశంలో సమస్య పరిష్కారమైంది. ఇకపై తమ సినిమాల్లో పాక్ నటీనటులను పెట్టుకోమని బాలీవుడ్ నిర్మాతలు హామీ ఇచ్చారు.

3. ఉడ్తా పంజాబ్: ఉడ్తా పంజాబ్ సినిమాలో 89 కట్స్ చేయాలంటూ సెన్సార్ బోర్డ్ నిర్ణయించడం బాలీవుడ్ ని షేక్ చేసింది. పంజాబ్ ను ఉద్దేశించిన ప్రతి డైలాగ్ ను తొలగించాల్సిందే అంటూ సెన్సార్ బోర్డ్ స్పష్టం చేసింది. ఈ అంశంలో బాలీవుడ్ మొత్తం నిర్మాత అనురాగ్ కశ్యప్ వెంట నిలిచింది. చివరకు బాంబే హైకోర్టు ఆదేశాలతో ఒక్క సెన్సార్ కట్ తోనే సినిమా రిలీజ్ అయింది.

4. హృతిక్ రోషన్ - కంగనా రనౌత్ ల వివాదాస్పద సంబంధం: బాలీవుడ్ యాక్షన్ హీరో హృతిక్ రోషన్, నటి కంగనా రనౌత్ ల రిలేషన్ షిప్ ఈ ఏడాది పెను సంచలనాన్ని సృష్టించింది. హృతిక్ తో డేటింగ్ చేశానని కంగనా చెబితే... హృతిక్ వాటిని ఖండించాడు. ఈ క్రమంలో కంగనాకు హృతిక్ లీగల్ నోటీసులు కూడా పంపాడు.


5. ప్రియాంక్ చోప్రా టీషర్ట్: 'కోండే నాట్ వెస్ట్ ట్రావెలర్' మేగజీన్ కవర్ పేజ్ పై స్లీవ్ లెస్ వైట్ టీషర్ట్ వేసుకుని ప్రియాంక చోప్రా ధరించిన టీషర్ట్ వివాదాస్పదమైంది. ఆ టీషర్ట్ పై రెఫ్యూజీ, ఇమ్మిగ్రెంట్, ఔట్ సైడర్, ట్రావెలర్ అనే పదాలు రాసి ఉన్నాయి. అయితే, ఒక్క ట్రావెలర్ అనే పదం మినహా మిగిలిన అన్ని పదాలు కొట్టివేసినట్టు ఉన్నాయి. దీంతో, వలసవాదులపై ప్రియాంకకు చిన్న చూపు ఉందంటూ సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. ఆ తర్వాత ఆమె క్షమాపణలు కోరింది. 

  • Loading...

More Telugu News