: నెల్లూరులో పేలుడు ఘటనపై ఆరా తీసిన చినరాజప్ప
నెల్లూరు శివారు పొర్లుకట్ట ప్రాంతంలోని బాణాసంచా తయారీ ఫ్యాక్టరీలో పేలుడు ఘటనపై ఏపీ డిప్యూటీ సీఎం చినరాజప్ప ఆరా తీశారు. నెల్లూరు ఎస్పీకి ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సంఘటనా స్థలానికి వెళ్లి సహాయ చర్యలు చేపట్టాలని, క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. ఈ ప్రమాద సంఘటనపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని, అనుమతిలేని బాణాసంచా తయారీ కేంద్రాలపై చర్యలు తీసుకోవాలని చినరాజప్ప ఆదేశించారు. కాగా, పేలుడు ఘటనపై మంత్రి నారాయణ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు.