: రంగంలోకి యూపీ గవర్నర్... మద్దతు నిరూపించుకోవాలని అఖిలేష్ ను కోరనున్న రాంనాయక్!


యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నామని సమాజ్ వాదీ పార్టీ ప్రకటించిన తరువాత ఏర్పడిన రాజకీయ శూన్యతను సరిదిద్దేందుకు గవర్నర్ రాంనాయక్ రంగంలోకి దిగారు. సీఎం అఖిలేష్ వెంటనే మద్దతు నిరూపించుకోవాలని నేడు ఆయన ఆదేశించనున్నట్టు తెలుస్తోంది. ఈ ఉదయం తన వర్గం ఎమ్మెల్యేలతో సమావేశం అనంతరం అఖిలేష్ యాదవ్ గవర్నర్ ను కలిసి, తనకు మద్దతిస్తున్న వారి జాబితాను అందిస్తారని సమాచారం.

తన తండ్రి దిగివచ్చి సస్పెన్షన్ ఆదేశాలను వెనక్కు తీసుకోకుంటే, కొత్త పార్టీని ప్రకటించాలని అఖిలేష్ వర్గం భావిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. కాగా, మరోవైపు ములాయం సింగ్ యాదవ్ పార్టీ ఎమ్మెల్యేలు, తన వర్గం నేతలతో ఈ ఉదయం 11:30 గంటలకు తన నివాసంలో సమావేశమై పరిస్థితిని చర్చించనున్నారు. రేపు తమ సీఎం అభ్యర్థిని ప్రకటిస్తామని ఇప్పటికే ములాయం ప్రకటించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News