: ఇండియాపై ఏ క్షణమైనా ఉగ్రదాడి జరగవచ్చని ఇజ్రాయిల్ హెచ్చరిక
భారతదేశంపై ఏ క్షణమైనా ఉగ్రవాదులు భారీ ఎత్తున దాడులతో విరుచుకుపడవచ్చని, పశ్చిమ దేశాల నుంచి వెళుతున్న పర్యాటకులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఇజ్రాయిల్ హెచ్చరించింది. కొత్త సంవత్సరం వేడుకలు, టూరిస్టులు లక్ష్యంగా ఈ దాడులు సాగవచ్చని, ముఖ్యంగా కేరళ, తమిళనాడు, మహారాష్ట్రల్లో దాడులు సాగే అవకాశాలున్నాయని పేర్కొంది. ఈ మేరకు టూరిస్టులకు హెచ్చరికలు జారీ చేశామని ఇజ్రాయిల్ యాంటీ టెర్రరిజం డైరెక్టరేట్ ఓ ప్రకటనలో పేర్కొంది. క్లబ్, బీచ్ పార్టీలకు ఇండియాలోని తమ దేశీయులు దూరంగా ఉండాలని, గోవా, పుణె, ముంబై, కొచ్చిన్ ప్రాంతాలు రిస్క్ లో ఉన్నాయని పేర్కొంది.