: మళ్లీ ఉల్లంఘన.. పూంఛ్ సెక్టార్ లో ‘పాక్’ కాల్పులు
కాల్పుల విరమణ ఒప్పందాన్నిపాకిస్థాన్ మళ్లీ ఉల్లంఘించింది. జమ్మూకాశ్మీర్ లోని పూంఛ్ సెక్టార్ లో భారత సైనిక స్థావరాలు లక్ష్యంగా ఈరోజు కాల్పులకు పాల్పడింది. ఈ ఘటనలో ఒక పౌరుడు ప్రాణాలు విడిచాడు. పాక్ కాల్పులను మన సైనికులు సమర్థవంతంగా తిప్పికొడుతున్నారని ఆర్మీ అధికారులు తెలిపారు.