: కొత్త ఏడాదిలో తమిళనాడు పర్యటనకు కేటీఆర్
మంత్రి కేటీఆర్ కొత్త ఏడాదిలో తమిళనాడులో పర్యటించనున్నారు. జనవరి 4, 5, 6 తేదీల్లో మంత్రి అక్కడికి వెళ్తున్నట్లు తెలంగాణ చేనేత, జౌళి శాఖ అధికారులు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రానికి భారీ పరిశ్రమలు సాధించే లక్ష్యంగా మంత్రి పర్యటన ఉంటుందని, ఆయన వెంట పరిశ్రమల శాఖ కార్యదర్శి అరవింద్ కుమార్, జౌళి శాఖ ముఖ్య అధికారులు వెళ్లనున్నట్లు చెప్పారు. వస్త్రోత్పత్తి రంగంలో సాధించిన అభివృద్ధి, ఆధునిక విధానాలను పరిశీలించడంతో పాటు, తెలంగాణ లో ఆధునిక పరిశ్రమల స్థాపనకు అందిస్తున్న రాయితీలు, ప్రోత్సాహకాలను అక్కడి పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులకు వివరించనున్నట్లు తెలిపారు.