: పార్థివ్ పటేల్ తో పోటీ లేదు: సాహా


టీమిండియా టెస్టు జట్టులో పునరాగమనం చేసిన వికెట్ కీపర్ పార్థివ్ పటేల్ తో తనకు ఎలాంటి పోటీ లేదని మరో కీపర్ వృద్ధిమాన్ సాహా తెలిపాడు. పార్థివ్ రాకతో పరిస్థితులేమీ మారిపోలేదని అన్నాడు. ఎవరు బాగా ఆడితే వారే జట్టుకు ఎంపికవుతారని స్పష్టం చేశాడు. అవకాశాలపై ఎలాంటి ప్రతికూల ప్రభావం పడదని చెప్పాడు. తానెవరికీ పోటీ కాదని, అలాగే తనకు ఎవరూ పోటీ కాదని ప్రకటించాడు. జట్టుకు ఎవరైతే సరిపోతారో వారినే సెలెక్టర్లు ఎంపిక చేస్తారని అన్నాడు. పార్థివ్ రాణించాడన్న ఆందోళన కూడా తనకు లేదని, ఎవరి అవకాశాలు వారికి ఉంటాయని వృద్ధిమాన్ సాహా స్పష్టం చేశాడు. కాగా, టెస్టు సిరీస్ లో పార్థివ్ పటేల్ రాణించగా, కీపింగ్ లో రాణించిన సాహా, బ్యాటింగ్ లో విఫలమైన సంగతి తెలిసిందే. 

  • Loading...

More Telugu News