: కోటి రూపాయలకు పైగా మావోయిస్టుల డబ్బు సీజ్... మనీ కష్టాల్లో మావోలు
పెద్ద నోట్ల రద్దుతో మావోయిస్టులు మనీ కష్టాలను ఎదుర్కొంటున్నారు. వారి వద్ద ఉన్న సొమ్మంతా పాత నోట్లే కావడంతో... వాటిని మార్చుకోలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు మావోలు. కొత్త కరెన్సీ వారికి అందుబాటులోకి రావడం లేదు. దీంతో, పాత నోట్లను మార్చుకోవడానికి గిరిజనుల జన్ ధన్ ఖాతాలను వారు ఉపయోగించుకుంటున్నారు. ఒడిశాలోని బస్తర్ జిల్లాలో జన్ ధన్ ఖాతాలపై ఐటీ అధికారులు నిఘా ఉంచారు. ఈ క్రమంలో, మావోల పాత నోట్లను మారుస్తున్న పలువురిని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. తాజాగా, రూ. కోటికి పైగా మావోల సొమ్మును పోలీసులు సీజ్ చేశారు.