: సర్వసభ్య సమావేశంలో జయలలిత కుర్చీ, దానిపై 'అమ్మ' ఫొటో.. వంగివంగి నమస్కరించిన నేతలు
చెన్నైలో గురువారం నిర్వహించిన అన్నాడీఎంకే పార్టీ సర్వసభ్య సమావేశంలో అపురూప ఘట్టం చోటుచేసుకుంది. దివంగత సీఎం జయలలిత వారి మధ్య లేకున్నా పార్టీ నేతలంతా ఆమె ఉన్నట్టే ప్రవర్తించారు. జయ జీవించి ఉన్నప్పుడు ఆమె కోసం ప్రత్యేకంగా ఓ కుర్చీ ఉండేదన్న విషయం తెలిసిందే. ఆమె ఎక్కడికి వెళ్లినా దానిని వెంట తీసుకెళ్లేవారు. దీనికంతటి ప్రాధాన్యం ఉండడంతో గురువారం నిర్వహించిన పార్టీ సర్వసభ్య సమావేశానికి కూడా దానిని తీసుకొచ్చారు. వేదిక మధ్యలో కుర్చీని ఉంచి దానిపై జయలలిత చిత్రపటం పెట్టి పూలమాలలు వేశారు. ఆ కుర్చీకి ఇరువైపులా నేతలు కూర్చున్నారు. ఆ తర్వాత సభ్యులు ఒక్కొక్కరుగా వెళ్లి ఫొటోకు వంగివంగి నమస్కరించారు. అమ్మ జీవించి ఉన్నప్పుడు ఎలా ఉండేవారే అచ్చం అలాగే వ్యవహరించారు.