: 77,500 రూపాయలు తీసుకుని జస్ట్ 100 గ్రాముల బరువు తగ్గించారు!


బరువు తగ్గాలా? మా క్లినిక్ కు రండి... ఎలాంటి ఆపరేషన్ లేకుండా, శారీరక శ్రమ లేకుండా బరువు తగ్గిస్తాం.. అంటూ ఎన్నో ప్రకటనలు చూస్తూ వుంటాం. అచ్చం అలాంటి ప్రకటన విని 77,500 రూపాయలు చెల్లించిన వ్యక్తికి కేవలం 100 గ్రాముల బరువు తగ్గించిన సంస్థకు కన్ స్యూమర్ ఫోరం జరిమానా విధించిన ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. ఆ ఘటన వివరాల్లోకి వెళ్తే, వినోద్ శర్మ అనే వ్యక్తి 93.5 కేజీల అధిక బరువుతో ఇబ్బంది పడేవారు. దీంతో ఎలాగైనా బరువు తగ్గించుకోవాలని ప్రయత్నించి ఓ స్లిమ్మింగ్ సెంటర్ కు వెళ్లారు. ఆ క్లినిక్ లో బరువు తగ్గిస్తామని నమ్మబలికి 77,500 రూపాయలు వసూలు చేశారు.

అనంతరం 2013 ఫిబ్రవరి 17 నుంచి మార్చి 15 వరకు చికిత్స అందించారు. అనంతరం వినోద్ శర్మ బరువు చూసుకోగా కేవలం 100 గ్రాముల బరువు మాత్రమే తగ్గినట్టు గుర్తించాడు. దీంతో మోసపోయానని గుర్తించిన వినోద్ శర్మ వినియోగదారుల ఫోరంను ఆశ్రయించారు. సదరు సంస్థ వ్యాపార ధోరణిని తప్పుపట్టిన కన్ స్యూమర్ ఫోరం వినోద్ శర్మ చెల్లించిన 77,500 రూపాయలతో పాటు జరిమానాగా 25,000 రూపాయలు చెల్లించాలని ఆదేశించింది. 

  • Loading...

More Telugu News