: పాకిస్థాన్ ఎయిర్ పోర్టు వెబ్ సైట్ ను హ్యాక్ చేసిన కేరళ హ్యాకర్లు
గతంలో తిరువనంతపురం ఎయిర్ పోర్టు వెబ్ సైట్ ను పాకిస్థాన్ కు చెందిన హ్యాకర్ల బృందం హ్యాక్ చేసి 'డేంజర్' గుర్తును డిస్ ప్లే చేసింది. దీనికి ప్రతీకారంగా కేరళకు చెందిన 'మల్లు సైబర్ సోల్జర్స్' బృందం పాకిస్థాన్ లోని పంజాబ్ ప్రావిన్స్ లో గల సెయిల్ కోట్ అంతర్జాతీయ విమానాశ్రయ వెబ్ సైట్ ను హ్యాక్ చేసి లాగిన్ కోడ్ ను 'మలయాళీస్' గా మార్చింది. ఈ లాగిన్ వివరాలను బహిరంగంగా ప్రదర్శనకు ఉంచింది. కాగా, గత కొంత కాలంగా పాకిస్థాన్ సైబర్ బృందం భారత్ పై హ్యాకింగ్ కు పాల్పడుతుండగా, వారికి మల్లు సైబర్ సోల్జర్స్ బృందం ఎదురుదాడులతో సమాధానం చెబుతున్న సంగతి తెలిసిందే.