: ఒరిజినల్ కోచ్ పీఆర్ సోంధీ ఆరోపణలకు జవాబిచ్చిన అమీర్ ఖాన్
ప్రముఖ రెజ్లర్ మహావీర్ సింగ్ ఫొగట్ జీవిత చరిత్ర ఆధారంగా అమీర్ ఖాన్ తెరకెక్కించిన 'దంగల్' సినిమా కలెక్షన్లలో దూసుకుపోతోంది. విమర్శకుల ప్రశంసలను సైతం అందుకుంటోంది. అయితే, నిజ జీవితంలో మహవీర్ సింగ్ కుమార్తెలు గీత, బబితలకు కోచింగ్ ఇచ్చిన పీఆర్ సోంధి మాత్రం తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. కామన్వెల్త్ గేమ్స్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా గీత మ్యాచ్ ను చూడకుండా మహావీర్ ను సోంధీ గదిలో బంధించినట్టు సినిమాలో చూపించారు. దీనిపై సోంధీ మాట్లాడుతూ, తాను అలా వ్యవహరించలేదని... సినిమాలో మసాలా దట్టించడానికి మరొకరి క్యారెక్టర్ ను కించపరచడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు.
సోంధీ ప్రశ్నకు అమీర్ ఖార్ ట్విట్టర్ ద్వారా సమాధానమిచ్చాడు. నిజ జీవిత చరిత్రలతో సినిమాలను నిర్మించేటప్పుడు... కథకు కొంత డ్రామాను కలపడం మామూలే అని చెప్పారు. అయితే, అసలైన కథ దారి తప్పకుండా జాగ్రత్తలు తీసుకుంటారని తెలిపాడు.