: చెత్తను ఊడ్చి, శుభ్రం చేసిన బీసీసీఐ అధ్యక్షుడు !
బీసీసీఐ అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్నారు. హిమాచల్ ప్రదేశ్ లోని హమీర్ పుర్ బస్టాండ్ ఆవరణలో చెత్తను ఊడ్చి, నీటితో శుభ్రం చేశారు. అంతేకాదు, అక్కడ వెలిసిపోయిన గోడలకు రంగులు వేశారు. ఈ విషయాన్ని అనురాగ్ ఠాకూర్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపారు. బస్టాండ్ ఆవరణను శుభ్రపరిచేందుకు సుమారు గంట సమయం వెచ్చించామని, ‘స్వచ్ఛ భారత్’ పై ప్రజలకు అవగాహన కల్పించే నిమిత్తం ఈ కార్యక్రమంలో తాను పాల్గొన్నానని ఆ ట్వీట్ లో అనురాగ్ పేర్కొన్నారు.