: ట్విట్టర్ తో ఒప్పందం చేసుకున్న ఐసీఐసీఐ బ్యాంక్


ప్రముఖ సోషల్ మీడియా సంస్థ ట్విట్టర్ తో ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ ఒప్పందం చేసుకుంది. తమ కస్టమర్లకు డిజిటల్ వేదికగా మరిన్ని సేవలను అందించే క్రమంలో ఈ ఒప్పందం కుదుర్చుకుంది. భారీ సంఖ్యలో ఉన్న తమ ఖాతాదారులు ఆన్ లైన్ లో అడిగే ప్రశ్నలకు నేరుగా సమాధానాలు చెప్పడానికి, వారి నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకోవడానికి ఈ వేదిక ఉపయోగపడుతుందని ఐసీఐసీఐ భావిస్తోంది. తమ కస్టమర్లకు కొత్త బ్యాంకింగ్ అనుభవాన్ని కల్పించడానికి ఈ ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొచ్చామని ఐసీఐసీఐ సీనియర్ మేనేజర్ సుజిత్ గంగూలీ తెలిపారు. 

  • Loading...

More Telugu News