: అన్నాడీఎంకేకి గుడ్ బై చెప్పిన సినీ నటుడు ఆనంద్ రాజ్


అన్నాడీఎంకే పార్టీ నుంచి వైదొలుగుతున్నానని ప్రముఖ నటుడు ఆనంద్ రాజ్ ప్రకటించారు. పార్టీలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు ఏమాత్రం బాగోలేవని ఈ సందర్భంగా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దివంగత జయలలితకు పార్టీ నేతలు సరైన గౌరవం ఇవ్వడం లేదని... ఆమెతో ఇతరులను పోల్చడం సరికాదని అన్నారు. మంత్రులు వ్యవహరిస్తున్న తీరు కూడా బాధాకరంగా ఉందని... జయ గౌరవాన్ని దెబ్బతీసే విధంగా వారు వ్యవహరిస్తున్నారని... ఇలాంటి చర్యలను వారు మానుకోవాలని చెప్పారు. ఈ రోజు జరిగిన పార్టీ సర్వసభ్య సమావేశానికి తనను ఆహ్వానించలేదని విమర్శించారు. డీఎంకే అధినేత కరుణానిధితో సమావేశమయ్యే అవకాశం వస్తే తప్పకుండా భేటీ అవుతానని చెప్పాడు. 

  • Loading...

More Telugu News