: పాపికొండలు చూద్దామనుకుంటే... చుక్కలు కనిపించాయి!


పాపికొండల అందాలను చూద్దామంటూ హుషారుగా విహారయాత్రకు బయల్దేరిన వారికి చుక్కలు కనిపించాయి. వారు బయల్దేరిన లాంచీ మార్గమధ్యంలో గోదావరిలో నిలిచిపోయింది. వివరాల్లోకి వెళ్తే, ఈ ఉదయం పురుషోత్తపట్నం నుంచి 150 మంది ప్రయాణికులతో సాయిగాయత్రీ లాంచీ పాపికొండలకు బయలుదేరింది. లాంచీ స్టీరింగ్ లో సాంకేతిక లోపం తలెత్తడంతో, ఉదయం 11.30 గంటల ప్రాంతంలో వీరవరం లంక వద్ద నది మధ్యలో అది నిలిచిపోయింది. జరిగిన ఘటనతో ప్రయాణికులు షాక్ కు గురయ్యారు. లాంచీ నిర్వాహకులు అధికారులకు సమాచారం అందించారు. ప్రయాణికులను మరో లాంచీ ద్వారా తీసుకెళ్లడానికి ఏర్పాట్లు చేశారు. 

  • Loading...

More Telugu News