: అమెరికాలో దారుణం: కుమారుడి గొంతుపిసికి... తాను కాల్చుకున్న మహిళ!


భర్తతో విభేదాలో, మరో కారణమో గానీ ఓ మహిళ తన కన్నకొడుకును చంపి, తానూ ఆత్మహత్యకు పాల్పడింది. అమెరికాలోని పెన్సిల్వేనియాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆత్మహత్యకు ముందు ఫేస్ బుక్ లో ఆమె అతిపెద్ద సూసైడ్ నోట్ ను పోస్ట్ చేసింది. ఇందులో... ‘వారసత్వంగా కుమారుడ్ని కలిగి ఉండే అర్హత నీకు లేదు’ అంటూ ఆమె తన భర్తను ఉద్దేశించి వ్యాఖ్యలు చేసింది. దీన్ని చూసిన వారు పోలీసులకు సమాచారం అందించడంతో ఈ విషయం వెలుగు చూసింది. షేరీ షెర్మేయర్ (40)తోపాటు, ఆమె ఏడాది వయసున్న కుమారుడు జాన్ మృతదేహాలను పోలీసులు వారి ఇంట్లో గుర్తించారు. షెర్మేయర్ భర్త అందుబాటులో లేకుండా పోయాడు. దీంతో, వీరిని హత్య చేసి, ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడేమోనన్న అనుమానాన్ని పోలీసులు వ్యక్తం చేశారు. శవపరీక్ష నివేదిక వస్తే వాస్తవాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. 

  • Loading...

More Telugu News