మాది ప్రజల తరఫున పోరాడే పార్టీ.. 'గుండుసూది' పార్టీ కాదు!: కేసీఆర్ పై సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య ఫైర్
కేసీఆర్ అటువంటి వ్యాఖ్యలు చేసి ప్రజాస్వామ్య విలువలను అపహాస్యం చేశారని రాజయ్య అన్నారు. ఈ విషయంపై తాము ఈ రోజు స్పీకర్ మధుసూదనాచారికి లేఖ ఇచ్చామని చెప్పారు. నిన్న భూసేకరణ చట్టం సవరణలపై చర్చ సందర్భంగా తాము చేసిన సూచనలను ప్రభుత్వం పట్టించుకోలేదని ఆయన అన్నారు. నిర్వాసిత ప్రాంతాల్లో ప్రభుత్వం సర్వే చేపట్టి రైతుల కష్టాలను తీర్చాలని ఆయన డిమాండ్ చేశారు.