: త్వరలోనే రాజకీయాల్లోకి వస్తా... అన్నాడీఎంకేను నడిపిస్తా: జయ మేనకోడలు దీప సంచలన ప్రకటన


దివంగత ముఖ్యమంత్రి జయలలిత మేనకోడలు దీపా జయకుమార్ సంచలన ప్రకటన చేశారు. సరైన సమయంలో రాజకీయాల్లోకి వస్తానని, అది సమీప భవిష్యత్తులోనే ఉంటుందని ఆమె ప్రకటించారు. జయలలిత మరణంతో తమిళనాడు రాజకీయాల్లో తీవ్ర శూన్యత ఏర్పడిందని చెప్పారు. అత్త మరణంతో తాను కొంత బాధలో ఉన్నానని... తనకు కొంత సమయం ఇవ్వాలని అన్నాడీఎంకే కార్యకర్తలను కోరారు.

మరోవైపు, జయలలిత వారసురాలు దీపేనంటూ తమిళనాడులోని పలుచోట్ల అన్నాడీఎకే కార్యకర్తలు బ్యానర్లు, కటౌట్లు పెడుతున్నారు. దీనిపై ఆమె స్పందిస్తూ, తన కటౌట్లు, బ్యానర్లు పెట్టడం ఆపాలని కోరారు. తనపై చూపుతున్న అభిమానానికి కృతజ్ఞతలు చెబుతున్నానని... ప్రస్తుతం నెలకొన్న విపత్కర పరిస్థితుల్లో అన్నాడీఎంకే కార్యకర్తలు సంయమనంతో ఉండాలని సూచించారు. అత్త ఆశీస్సులతోనే ముందుకు సాగుతానని... ఆమె తరహాలోనే పార్టీని, రాష్ట్రాన్ని ముందుకు నడిపేందుకు కృషి చేస్తానని చెప్పారు.


  • Loading...

More Telugu News