: కాంగ్రెస్ పార్టీ ఆత్మపరిశీలన చేసుకోవాలి: వెంకయ్యనాయుడు


పార్లమెంటు నుంచి పంచాయతీ వరకు, ఢిల్లీ నుంచి గల్లీ వరకు 62 ఏళ్లు కాంగ్రెస్ పార్టీ దేశాన్ని పరిపాలించిందని, ఈ రోజు పార్టీ ఆవిర్భావ దినోత్సవం కూడా జరుపుకుంటోందని, ఈ తరుణంలో ఆ పార్టీ ఆత్మపరిశీలన చేసుకోవాలని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు సలహా ఇచ్చారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ పాలనలో అవినీతి, కుంభకోణాలు ఎందుకు జరిగాయో ఆత్మపరిశీలన చేసుకోవాలని ఆయన సూచించారు.

కేంద్రం తీసుకున్న నిర్ణయాలకు కాంగ్రెస్ మద్దతు పలకాలని ఆయన అన్నారు. బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేయగానే పని అయిపోలేదని, అప్పుడే అసలు పని మొదలవుతుందని చెప్పారు. డిసెంబర్ నెలాఖరు వరకు ప్రధాని సమయం కోరారంటే...ఆ తరువాత సమస్యలు సద్దుమణుగుతాయని అర్థమని, సమస్యలు మొత్తం సమసిపోతాయని మాత్రం ఆయన చెప్పలేదని వెంకయ్యనాయుడు తెలిపారు. 

  • Loading...

More Telugu News