: అమీర్ ఖాన్ పాదాలను తాకాలని ఉంది: వర్మ
అమీర్ ఖాన్ నటించిన 'దంగల్' సినిమా అద్భుతంగా ఉందని ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కితాబిచ్చాడు. ఈ సినిమా చేసిన తర్వాత అమీర్ ఖాన్ పాదాలను తాకాలనిపిస్తోందని అన్నాడు. 50 ఏళ్ల వయసులో 'దంగల్' సినిమా కోసం సిక్స్ ప్యాక్ లో కనిపించి, మళ్లీ అదే సినిమా కోసం బరువు పెరిగాడని అమీర్ ఖాన్ ను ప్రశంసించాడు. పిల్లల తండ్రి పాత్ర కోసం ఇంతవరకు ఏ హీరో బరువు పెరిగాడో చెప్పాలని ప్రశ్నించాడు. సినిమాలను ఆదరించే ప్రేక్షకుల తెలివితేటలను తనతో సహా అందరూ తక్కువగా అంచనా వేస్తారని... కానీ, అమీర్ మాత్రం ప్రేక్షకుల అభిప్రాయాలను గౌరవించి, సినిమాలను తీస్తారని ప్రశంసించాడు.