: ఇంటింటికి నల్లా కాదు...విద్య కావాలి: ఆర్. కృష్ణయ్య


ఇంటింటికి నల్లా కాదు, విద్య కావాలని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య తెలిపారు. అసెంబ్లీలో జరిగిన ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడుతూ, డీఎస్సీ కోసం 5 లక్షల మంది నిరుద్యోగులు ఆశగా ఎదురు చూస్తున్నారని, తక్షణం ఖాళీగా ఉన్న 50 వేల టీచర్ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా వివిధ శాఖల్లో భర్తీ కాకుండా ఉన్న 2 లక్షల పోస్టులను భర్తీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అసెంబ్లీలో ప్రజా సమస్యలు చర్చకు రాకుండా అడ్డుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. 

  • Loading...

More Telugu News