: గుండె జబ్బులకు జన్యు చికిత్స విధానం


స్ట్రోక్‌ వల్ల గుండెపనిచేయడం ఆగిపోతే.. గుండెలోని పంపింగ్‌ వ్యవస్థను పునరుద్ధరింపజేసి.. తిరిగి పనిచేసేలా చేయడానికి బ్రిటన్‌ శాస్త్రవేత్తలు ఒక నవీన జన్యుచికిత్స విధానాన్ని అభివృద్ధి చేశారు. దీనిని ఇంజెక్షన్ల రూపంలో రోగికి అందిస్తారు. ఇలాంటి చికిత్స వల్ల గుండెజబ్బులతో సంభవించే మరణాలు సగం వరకు తగ్గుతాయని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. గుండె మార్పిడి చేయాల్సిన అవసరం కూడా ఉండదని శాస్త్రవేత్తలు అంటున్నారు.

ఈ విషయంలో పరిశోధనలు సాగించిన బ్రిటన్‌ హార్ట్‌ ఫౌండేషన్‌ మెడికల్‌ డైరక్టర్‌ ప్రొఫెసర్‌ పీటర్‌ వెయిన్‌బర్గ్‌ మాట్లాడుతూ.. ప్రస్తుతం ఇలాంటి సమస్యకు ఉపయోగిస్తున్న మందుల వల్ల కొంత ఉపశమనం కలుగుతుందని.... అంతే తప్ప ఆగిపోయిన గుండె పనితీరును పునరుద్ధరించే అవకాశం మాత్రం లేదని చెప్పారు. ఆ దిశగా ఈ నవీన పరిశోధన వైద్యపరంగా చాలా గొప్ప ఆవిష్కారం అవుతుంది. గుండెజబ్బులపై ఈ కొత్త తరహా జన్యు చికిత్స విధానాన్ని రెండువందల మంది రోగులపై ప్రయోగించి చూస్తారట.

  • Loading...

More Telugu News