: ఏం పాపం చేశామని ఇలా చేశారు?: బోరున విలపిస్తున్న తమిళనాడు మాజీ సీఎస్ భార్య
తమ జీవితాలను తమిళనాడు రాష్ట్రాభివృద్ధికి ధారపోస్తే ఇప్పుడిలాంటి పరిస్థితిని తీసుకువచ్చారని తమిళనాడు మాజీ సీఎస్ రామ్మోహన్ రావు సతీమణి బోరున విలపించారు. తన భర్త నిరపరాధని, తమ కుటుంబం ఓ పెద్ద కుట్రకు బలైపోయిందని ఆమె అన్నారు. ఓ టీవీ చానల్ తో స్వచ్ఛమైన తెలుగులో మాట్లాడిన ఆమె, నిజాయతీపరుడిని రోడ్డుపైకి లాగి పరువు తీశారని ఆవేదన వ్యక్తం చేశారు.
మనిషినే చంపేసినట్టుగా ఫీలవుతున్నామని, ఎందుకు ఇలా చేశారో తెలియడం లేదని అన్నారు. ఏం పాపం చేశామని ఇలా చేస్తున్నారని ప్రశ్నించారు. తనపై కుట్రను తట్టుకోలేకనే ఆయనకు గుండెపోటు వచ్చిందని అన్నారు. తానుంటున్న వీధిలో కూడా తానెవరో ఎవరికీ తెలియదని, ఆరేళ్లుగా ఇక్కడే ఉంటున్నా ఎన్నడూ బయటకు రాలేదని, తమ కుటుంబాన్ని ఇలా ఎందుకు వేధిస్తున్నారో తెలియడం లేదని విలపించారు.