: న్యూఇయర్ ఈవెంట్ మేనేజర్లకు తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖ షాక్!


నూతన సంవత్సర వేడుకలను నిర్వహించే ఈవెంట్ మేనేజ్ మెంట్ సంస్థలకు తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖ షాక్ ఇచ్చింది. ఈవెంట్లకు సంబంధించి వసూలు చేసే మొత్తాలపై 20 శాతం వినోదపు పన్ను చెల్లించాలంటూ వాణిజ్య పన్నుల కమిషనర్ అనిల్ కుమార్ తెలిపారు. ఈవెంట్ మేనేజర్లు తమ పరిధిలో ఉన్న వాణిజ్య పన్నుల సర్కిల్ కార్యాలయాల్లోని అధికారులను కలసి తమ కార్యక్రమ వివరాలను నమోదు చేసుకోవాలని చెప్పారు. వినోదపు పన్ను చెల్లించకుండా ఈవెంట్లను నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఐదు రెట్ల అపరాధ రుసుమును కూడా విధిస్తామని వార్నింగ్ ఇచ్చారు.

  • Loading...

More Telugu News