: కూతురు గ్రేషియాతో క్రికెటర్ రైనా ఫొటో అదిరింది!
క్రికెటర్ సురేశ్ రైనా తన ముద్దుల కూతురు, గారాలపట్టి గ్రేషియాతో కలిసి ఫొటోకు పోజ్ ఇచ్చాడు. ఈ ఫొటో దిగింది ఒక వేదికపైనో లేక పర్యాటక ప్రాంతంలోనో కాదు.. విమాన ప్రయాణంలో. ఒకరి ముఖంలోకి మరొకరు చూస్తూ ఉన్న రైనా, గ్రేషియాల ఫొటో అదిరింది. ఈ ఫొటోను రైనా తన ట్విట్టర్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. కాగా, పేలవ ప్రదర్శన కారణంగా టీమిండియా జట్టుకు దూరమైన మిడిలార్డర్ బ్యాట్స్ మెన్ రైనా, ప్రస్తుతం తన కుటుంబసభ్యులతో కలిసి విహారయాత్రలు చేస్తున్నాడు.