: పెద్దనోట్ల రద్దు వల్ల అవినీతి పెరిగింది: రాహుల్ గాంధీ
పెద్దనోట్ల రద్దు అనంతర పరిస్థితులపై కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోమారు విమర్శలు గుప్పించారు. నోట్ల రద్దు
వల్ల దేశంలో అవినీతి పెరిగిందని విమర్శించారు. నోట్ల రద్దుతో రైతులు, కూలీల వద్ద డబ్బులు లేని పరిస్థితి నెలకొందని అన్నారు. ఈ నెల 30 వరకు అన్ని పరిస్థితులు సర్దుకుంటాయని ప్రధాని మోదీ చెప్పారని, అయితే, అలాంటి పరిస్థితులు దేశ వ్యాప్తంగా ఎక్కడా కనిపించడం లేదన్నారు. నోట్ల రద్దు వెనుక అసలు ఉద్దేశం ఏమిటో ప్రజలకు ప్రధాని వివరించాలని రాహుల్ డిమాండ్ చేశారు.