: మరో 400 రైల్వే స్టేషన్లలో అందుబాటులోకి రానున్న ఫ్రీ వైఫై


వచ్చే ఏడాది నాటికి దేశంలోని మరో 400 రైల్వే స్టేషన్లలో ఉచిత వైఫైను అందించడానికి రైల్వే శాఖ చర్యలు తీసుకుంటోంది. ఈ ఏడాది ఉచిత వైఫై ఏర్పాటు చేసిన స్టేషన్ల సంఖ్య 100కు చేరుకుందని రైల్వే అధికారులు తెలిపారు. ముంబై స్టేషన్ నుంచి మొదలు పెట్టి కేరళలోని కొల్లం స్టేషన్ వరకు ఉచిత వైఫై సదుపాయాన్ని కల్పించామని చెప్పారు. గూగుల్ సహాయంతో రద్దీగా ఉండే 100 స్టేషన్లలో వైఫై సదుపాయం కల్పించామని తెలిపారు. వచ్చే ఏడాది మరో 400 మేజర్ స్టేషన్లలో ఉచిత వైఫైను అందిస్తామని చెప్పారు. ఈ ఏడాది అందించిన ఉచిత వైఫైతో దాదాపు కోటి మంది ప్రయాణికులు లబ్ధి పొందారని అధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News