: నా పని నేను చేస్తుంటే.. కొందరికి భయమేస్తోంది!: ప్రధాని మోదీ


తన పని తాను చేస్తుంటే, కొందరికి భయమేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఉత్తరాఖండ్ లోని డెహ్రాడూన్ లో ఎన్ డీఏ తొలి పరివర్తన్ ర్యాలీ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, ‘ఉత్తరాఖండ్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం. వెయ్యి రోజుల్లో గ్రామాల్లో విద్యుత్ సౌకర్యం కల్పించాలన్నదే లక్ష్యం. ఇప్పటికే 12 వేలకు పైగా గ్రామాల్లో విద్యుత్ సౌకర్యం కల్పించాం. లక్షల మందికి గ్యాస్ కనెక్షన్లు ఇచ్చి పొగ నుంచి విముక్తి కల్పించాం. పొగ పీల్చడం వల్ల మహిళలు అనారోగ్యానికి గురువుతున్నారు. పేద మహిళలకు గ్యాస్ సౌకర్యం కల్పించడం తప్పా? నలభై ఏళ్ల పాటు ఓ కుటుంబం ఆర్మీని మోసం చేసింది. మేము అధికారంలోకి రాగానే ఒకే ర్యాంక్ ఒకే పింఛన్ (ఓఆర్ఓపీ)విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చాం. నేను ఏదో చేస్తానని నాపై ప్రజలు నమ్మకం పెట్టుకున్నారు. నన్ను ఈ దేశానికి వాచ్ మెన్ గా నియమించారు.  ప్రభుత్వాన్ని చూసి నల్లకుబేరులు భయపడుతున్నారు.  అవినీతికి వ్యతిరేకంగా యుద్ధం చెయొద్దంటే ఎలా? నల్లధనంపై యుద్ధం కొనసాగుతుంది’ అని మోదీ అన్నారు. 

  • Loading...

More Telugu News