: భారత్ అవాస్తవాలు చెబుతోంది!: చైనా నసుగుడు


అగ్ని 5 క్షిపణిని తయారు చేస్తున్నామని ప్రకటించిన నాటి నుంచి ఏం చేయాలో పాలుపోక చైనా గింజుకుంటోంది. భారత్ లోని అణువణువునూ చేరుకోగల ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ క్షిపణులు తమ వద్ద ఉన్నాయని చెబుతూ వచ్చిన చైనా, అగ్ని 5 క్షిపణి నాలుగో ప్రయోగంలో కూడా విజయవంతంగా లక్ష్యాన్ని ఛేదించడాన్ని చైనా జీర్ణించుకోలేకపోతోంది. బీజింగ్ సహా చైనాలోని పెద్దపట్టణాలన్నీ ఈ క్షిపణి పరిధిలోకి వచ్చాయి. ఈ క్షిపణి తయారీ నాటి నుంచి దాని దూరంపై భారత్ అవాస్తవాలు చెబుతోందని ఆరోపిస్తోంది. వాస్తవానికి భారత్ తయారు చేసిన అగ్ని 5 క్షిపణి రేంజ్ 8,000 కిలోమీటర్లని, భారత్ ఉద్దేశ పూర్వకంగా అది ప్రయాణించే దూరాన్ని తక్కువ చేసి 5,800 కిలోమీటర్ల దూరం అంటోందని ఆరోపిస్తోంది.

 దానికి తోడు ఈ క్షిపణి 10 టన్నుల బరువైన అణ్వాయుధాలను మోసుకెళ్లగలదు. ఒకేసారి పలు రకాల మిసైళ్లను మోసుకెళ్లి వివిధ లక్ష్యాలను ఛేదించగలదని భారత్ నిరూపించింది. ఇది చైనా వెన్నెలో వణుకు పుట్టిస్తోంది. భారత్ పై చైనా ఆక్రందనను ఎవరూ పట్టించుకునే అవకాశం లేకపోవడంతో యూరోప్ లోని 70 శాతాన్ని అగ్ని 5 చేరుకోగలదని సరికొత్త భయాన్ని కలిగించే ప్రయత్నం చేస్తోంది. వాస్తవానికి ఈ క్షిపణి తయారీ చేపట్టినప్పుడు అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ కు ఆ సామర్థ్యం ఉందా? ఒక వేళ ఉన్నా అక్కడి నేతలు దానిని సాకారం కానిస్తారా? అన్న అనుమానాలు ఉండేవి. అయితే దానిని విజయవంతంగా ప్రయోగించడంతో మరోసారి దానిపై అనవసర రాద్ధాంతం చేస్తోంది. 

  • Loading...

More Telugu News