: పాత నోట్లు మారుస్తామని 17 లక్షలు ఎత్తుకెళ్లారు


విశాఖ జిల్లా గాజువాకలో దోపిడీ ముఠా బీభత్సం సృష్టించింది. పాతనోట్లు మారుస్తామంటూ దోపిడీ ముఠా స్థానికులను సంప్రదించింది. ఈ క్రమంలో వారికి వెలగపాకకు చెందిన నలుగురు వ్యక్తులు తమ వద్దనున్న 17 లక్షల రూపాయల పాతనోట్లు మార్చాలని కోరారు. దీంతో దోపిడీ ముఠా డబ్బులు తీసుకుని రావాలంటూ గాజువాకలో ఒక అడ్రస్ చెప్పారు. అనంతరం డబ్బులు పట్టుకుని వచ్చిన నలుగురు వెలగపాక వాసులను గాయపరిచి, డబ్బు లాక్కుని పరారయ్యారు. దీంతో బాధితులు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించడంతో వారు ఏడుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. 

  • Loading...

More Telugu News