: కోహ్లీకి కోపం తెప్పిస్తే సగం పని అయిపోయినట్టే: స్టీవ్ స్మిత్


టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీకి కోపం తెప్పిస్తే టెస్టుల్లో సగం విజయం సాధించినట్టేనని ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ అన్నాడు. ఫిబ్రవరిలో ఆసీస్ తో టెస్టు సిరీస్ ప్రారంభం కానున్న నేపథ్యంలో స్మిత్ మాట్లాడుతూ, గత 18 నెలలుగా టీమిండియా అద్భుతమైన ఆటతీరు ప్రదర్శిస్తోందని అన్నాడు. టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ అంతర్జాతీయ స్టార్ అనడంలో ఎలాంటి ఆతిశయోక్తి లేదని అన్నాడు. అద్భుతమైన ఫాంలో ఉన్న కోహ్లీని, టీమిండియాను నిలువరించడానికి తమ వద్ద వ్యూహం ఉందని చెప్పాడు. కోహ్లీకి కోపం తెప్పిస్తే ఏకాగ్రత కోల్పోతాడని, అతని ఏకాగ్రత చెదిరిపోతే విజయం సాధించడం పెద్ద కష్టం కాదని అన్నాడు. ఇదే వ్యూహాన్ని భారత్ తో సిరీస్ లో అమలు చేస్తామని చెప్పాడు. ఫిబ్రవరి 23 నుంచి భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య సిరీస్ ప్రారంభం కానుంది. 

  • Loading...

More Telugu News