: ఫుల్లుగా తాగి ఆటోడ్రైవర్ పై చిందులు తొక్కిన యువతి!!


తప్పతాగిన యువతి హైదరాబాదులో హల్ చల్ చేసిన ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... ఫిలింనగర్‌ నుంచి కృష్ణా నగర్‌ వరకు ఆటోలో వచ్చిన ఓ యువతి డబ్బులడిగిన డ్రైవర్ పై తిట్ల దండకం ప్రారంభించింది. అంతటితో ఆగని ఆ యువతి అతనిపై దాడికి దిగే ప్రయత్నం చేసింది. స్థానికులు అడ్డుకునే ప్రయత్నం చేయగా, వారిపై చిందులు తొక్కింది. దీంతో ఆ ఆటో డ్రైవర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు వచ్చి ఆమెకు బ్రీత్ ఎనలైజర్ పరీక్షల నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఆమె గతంలో రెండు సార్లు మద్యం మత్తులో హల్ చల్ చేసినట్టు పోలీసులు తెలిపారు. 

  • Loading...

More Telugu News